అందువల్లే ఆవుల మృత్యువాత..

అందువల్లే ఆవుల మృత్యువాత..

తాడేపల్లిలోని గోశాల ఆవుల మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రాథమిక రిపోర్ట్‌ ప్రకారం... టాక్స్‌సిటీ అని తేలింది. గడ్డి మినహా ఎలాంటి ఆహారం వీటి పొట్టల్లో లేవని నిర్ధారించారు పశువైద్యులు. టాక్సి సిటీ కారణంగా శరీరం లోపల అవయావాలపై రక్తపు చారలున్నట్లు గుర్తించారు. ఊపరితిత్తులు, గుండెపనై అక్కడక్కడా రక్తపు చారాలు ఉన్నాయి. టాక్సిసిటీ కారణగానే ముక్కులోంచి రక్తం బయటికి వచ్చినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఇది బ్లోటింగ్‌ కాదని తేల్చారు వైద్యులు. పీచుపదార్ధాలు, లేదా రవ్వ పిండి పదార్ధాల వల్ల గ్యాస్‌ పెరిగి ఉండొచ్చని భావిస్తున్నారు వైద్యులు..

గత తొంభై ఏళ్లుగా నడస్తోన్న గోశాలలో 1500 ఆవులు ఉన్నాయి. అయితే దీని నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. అపరిశుభ్ర వాతావరణంలో ఆవులను పెంచుతున్నారు. ఆవరణ అంతా బురద, పేడతో ఉంది. . ఆవులన్నింటికి గడ్డి మాత్రమే వేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. గడ్డి తింటే కడుపులో గ్యాస్ పెరిగి చనిపోయే అవకాశం ఉండదని.. రవ్వ లేదా పిండి లాంటి ఆహారం ఎక్కువగా తినడం వల్లే పొట్టలో గ్యాస్ పెరిగిపోయి ఇలా జరుగుతుందంటున్నారు..

మరోవైపు.. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, మల్లాది విష్ణులు గోశాలను సందర్శించారు. ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు మొత్తానికి గోశాల ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గోశాల కమిటీ సభ్యుల మధ్య విబేధాలు కూడా ఇందుకు కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story