భార్యను దారుణంగా హత్యచేసిన భర్త

భార్యను దారుణంగా హత్యచేసిన భర్త
X

సూర్యాపేట మండలం జాటోత్ తండాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. .. తాగుడుకు బానిసైన శంకర్‌ అనే వ్యక్తి సోమరిగా తిరుగుతూ డబ్బు కోసం రోజు భార్యను వేధించేవాడు. పనికి వెళ్లినచోట ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని భార్యను హింసించేవాడు. ఇదే విషయంపై గత రెండురోజులుగా ఇద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యపై ద్వైషం పెంచుకున్న శంకర్‌..ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడిచేశాడు. మెడపై తీవ్రంగా గాయాలు కావడంతో మల్లమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. పక్కింటివారు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES