అంబులెన్స్ లేక 35 కిలోమీటర్లు జెట్టిలోనే ...

అంబులెన్స్ లేక 35 కిలోమీటర్లు జెట్టిలోనే ...

అభివృద్ధి గురించి ప్రభుత్వాలు ఎన్ని గొప్పలు చెబుతున్నా ... క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటున్నాయి. ఈ హైటెక్ యుగంలోనూ గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. ఇప్పటికీ జెట్టీలే అంబులెన్స్‌లుగా మారుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు సరిహద్దులోని తెట్టెమడుగు గ్రామానికి చెందిన సక్కు అనే వ్యక్తి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు..పరిస్థితి విషమించడంతో బాధితుడు చర్లకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే అక్కడ అంబులెన్స్ సదుపాయం లేదు. ప్రైవేట్ వెహికిల్‌లో తీసుకెళ్లే స్థోమత కూడ లేదు..దీంతో జెట్టీనే అంబులెన్స్‌గా మార్చారు. అనారోగ్యంతో ఉన్న సుక్కుని సుమారు 35 కిలోమీటర్ల మేర అలాగే జెట్టీలో మోసుకెళ్లారు..రొడ్డుమీదుగా 35 కిలోమీటర్ల మేర అలా ఓ వ్యక్తిని జెట్టిలో మోసుకెళ్తుంటే ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు..దారిలో అనేక వాహనాలు ఎదురైనా ఎవరూ ఆపలేదు..

Tags

Read MoreRead Less
Next Story