ఉగ్రవాదులకు సాయం.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

ఉగ్రవాదులకు సాయం.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది కేంద్రం. ఉగ్రవాదులతో సంబంధాలున్నవారిని అరెస్ట్‌ చేస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే రషీద్ ను అరెస్టు చేసి రిమాండుకు పంపించింది. ఇతను.. ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు గుర్తించింది కేంద్రం. రషీద్ అరెస్టుకు నిరసనగా దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదని, భారత్ భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా అక్కడి పార్టీలు కోర్టుల్ని ఆశ్రయిస్తున్నాయి. మోడీ సర్కారు నిర్ణయంపై తాజాగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శనివారం న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. కశ్మీర్‌ను విభజిస్తూ.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. కశ్మీరీల అభిప్రాయానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని విభజించారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. ఒమర్‌ అబ్దుల్లా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది...

మరోవైపు.... ఆర్టికల్‌ 370 రద్దుపై కశ్మీర్ నేతలు కోర్టుల్ని ఆశ్రయిస్తారని ముందే ఊహించిన మోదీ సర్కారు. అందుకు అనుగూణంగానే వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించిన కేంద్రం ... ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ముందకు వెళ్తోంది.

అటు.... ప్రస్తుతం కశ్మీర్‌లో పరిస్థితి అదుపులో నే ఉంది. కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ఎత్తివేశారు. మొబైల్‌ సర్వీసులను కూడా పునురుద్ధరించారు. జమ్మూలో స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. స్థానికులు.. నిత్యవాసరాల కోసం మార్కెట్లు వెళ్తున్నారు. జాతీయ భద్రతా సలహదారు అజిత్‌ దోవల్‌.... జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శనివారం ఆయన అనంత్‌నాగ్‌లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఈద్‌ పండుగ ఏర్పాట్లను, స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. వీధుల్లో తిరుగుతూ తనకు ఎదురుపడిన స్థానికులతో మాట్లాడారు. పిల్లలతో సరదా ముచ్చటించారు.. ఓ గొర్రెల మందను సైతం సందర్శించారు దోవల్‌. వ్యాపారం ఎలా జరుగుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story