ఎద్దులను పట్టుకునేందుకు పోటీ పడి..

ఎద్దులను పట్టుకునేందుకు పోటీ పడి..

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహించారు. సాధారణంగా సంక్రాంతి సమయంలో జల్లికట్టు నిర్వహిస్తుంటారు. కమతమురులో మాత్రం ఇవాళ మైలారు పండగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో.. ఈ వేడుకను తిలకించేందుకు అక్కడి నుంచి పెద్దసంఖ్యలో జనం వచ్చారు.

మైలారు పండగులో భాగంగా నిర్వహించిన జల్లికట్టులో 500 ఎద్దులను వదిలారు. ప్రమాదమని తెలిసినా వాటిని పట్టుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story