వంటనూనెతో వాహనాలు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. ఇకనుంచి..

వంటనూనెతో వాహనాలు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం.. ఇకనుంచి..

పెట్రోల్ కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయ్! మరోవైపు డీజిల్ ధర కూడా అంతే ఉంది.ఈ రెండు లేకుండా వాహనాలు నడిస్తే ! ఇదే ఆలోచనలో చేసింది మోదీ ప్రభుత్వం! పెట్రోలు, డీజిల్‌ లేకుండా.... వాడిన వంటనూనెతో వాహనాలు నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ - వెహికిల్స్‌ తయారీనీ ప్రోత్సహిస్తోన్న మోదీ సర్కారు.... ఇప్పుడు పెట్రోల్, డిజిల్ కాకుండా..వంట నూనెల నుంచి బయో డీజిల్ తయారీకి చర్యలు తీసుకుంది.

వంటల కోసం నూనెను ఓసారి వేడి చేసిన తర్వాత... దాన్ని రెండోసారి వేడి చేసి వాడటం ఆరోగ్యానికి హానికరం ఇలా వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఒకసారి వినియోగించిన వంట నూనెను బయో డీజిల్‌గా మార్చనున్నారు. ఇందుకోసం దేశంలోని పలు చమురు సంస్థలు ముందుకొచ్చాయి. HPCL, BJPC, IOC సంస్థలు...మిగిలిపోయే నూనెను... కొనుక్కొని బయో డీజిల్ తయారుచేయిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో భారత్‌ ఇంధన డిమాండ్‌ను తీర్చేందుకు ఉపయోగపుడుతుంది.

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంద నగరాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో వంటనూనెల కొనుగోలు కార్యక్రమం మొదలైంది. ఇలా తయారు చేసిన బయోడీజిల్‌‌ను తొలి ఏడాది లీటరుకు రూ.51, రెండో ఏడాది రూ.52.7, మూడో ఏడాది నుంచి రూ.54.50 చొప్పున అమ్ముతామని ప్రకటించాయి ఓఎంసీలు. దీనికి సంబందించి మొబైల్‌‌ అప్లికేషన్‌‌ను, రీపర్పస్‌‌ యూజ్డ్‌‌ కుకింగ్‌‌ ఆయిల్‌‌ స్టికర్‌‌ను కూడా ఆవిష్కరించారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌..

బయో డీజిల్‌‌‌ తయారీ కోసం 300లకు పైగా కంపెనీలు ముందుకు వచ్చాయి. 2024 నాటికి ఐదు వేల యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ప్రస్తుతం ప్రతి నెలా 850 కోట్ల లీటర్ల డీజిల్‌‌ ఖర్చవుతోంది. 2030 నాటికి డీజిల్‌‌లో 5 శాతం బయోడీజిల్‌‌ను కలపాలని భావిస్తోంది. ఇందుకోసం ఏటా 500 కోట్ల లీటర్ల బయోడీజిల్‌‌ అవసరమవుతుంది. దేశవ్యాప్తంగా ఏటా 2,700 కోట్ల లీటర్ల వంటనూనెను వాడుతుండగా, ఇందులో 140 కోట్ల లీటర్లు యూసీఓగా మారుతుంది. హోటళ్ల నుంచి, రెస్టారెంట్ల నుంచి, క్యాంటీన్ల నుంచి దీనిని తీసుకుంటే, ఏటా 110 కోట్ల లీటర్ల బయోడీజిల్‌‌ తయారు చేయవచ్చంటున్నారు నిపుణులు. కేంద్రం తీసుకున్న ఈ చర్య సక్సెస్‌ అవుతుందంటున్నారు నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story