కామ మృగాలు.. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

కామ మృగాలు..  బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..
X

వరంగల్‌లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే..15 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. దీంతో ఆ అవమానం భరించలేని బాలిక.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

నిందితుల్లో పెంబర్తి గ్రామానికి చెందిన రాజేష్‌, తిరుపతి, బిట్టుగా పోలీసులు గుర్తించారు. అత్యాచార నిందితుల్లో ఓ ప్రజాప్రతినిధి తమ్ముడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డిజె ద్వారా బాలికను పరిచయం చేసుకున్న రాజేష్‌ అనే యువకుడు.. గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన రాజేష్‌... స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ గ్యాంగ్‌ రేప్‌ జిల్లాలో కలకలం రేపింది. అవమానం భరించలేని బాలిక.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రవీణ్‌లాగే ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులకు కూడా ఉరిశిక్ష విధించాలని మహిళా, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Also Watch :

Next Story

RELATED STORIES