కృష్ణా జిల్లా వాసుల్ని పాములు పగబట్టాయా?

కృష్ణా జిల్లా వాసుల్ని పాములు పగబట్టాయా?

కృష్ణా జిల్లా వాసుల్ని పాములు పగబట్టాయా. పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా మొవ్వ మండలంలో యద్ధనపూడి గ్రామానికి చెందిన యడ్ల ఆంజనేయులు, దుర్గా భవానీ దంపతుల 15 నెలల కొడుకు తేజ్‌ ను పింజర పాము కాటేసింది. ఇంటి వసారాలో ఆడుకుంటూ ఉండగా పాము కాటుకు గురయ్యాడు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొవ్వ ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి బాబు కండిషన్‌ సీరియస్‌గా ఉంది. వెంటనే స్పందించిన వైద్యులు ట్రీట్‌మెంట్‌ చేయడంతో ప్రాణాలు దక్కాయి.

పామర్రు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో పాము కాటు ఘటనలు ప్రతీ రోజు సంభవిస్తున్నాయి. మొవ్వ పరిసర ప్రాంతవాసుల్ని కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. జులైలో 70 పాముకాటు కేసులు నమోదు కాగా, ఆగస్టులో ఇప్పటి వరకు 110 పాముకాటు కేసులు నమోదు కావడం గమనార్హం. కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో పొలాల్లోకి వెళ్లాలంటే రైతులు, కూలీలు భయపడుతున్నారు. ఎక్కడ ఏ విషకీటకం కాటేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటు దివిసీమ ప్రాంతంలోనూ తరుచుగా పాము కాటు ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.

Tags

Read MoreRead Less
Next Story