తాజా వార్తలు

శరవేగంగా నిండుతోన్న సాగర్.. పులిచింతలకు పయనం..

శరవేగంగా నిండుతోన్న సాగర్.. పులిచింతలకు పయనం..
X

నాగార్జున సాగర్ శరవేగంగా నిండుతోంది. గంటకు గంటకు నీటిమట్టం పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 8 లక్షల 25 వేల క్యూసెక్కుల వరకూ ఉండి. ప్రస్తుతం 20 గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా పులిచింతలకు చేరుతోంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 550 అడుగులకు చేరింది. మరో 87 టీఎంసీలు నీరొస్తే.. ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతమన్న ఫ్లో కొనసాగితే రోజుకు 55 టీఎంసీల వరకూ వరద వస్తోంది కాబట్టి.. రేపటి కల్లా పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ గేట్లు ఒక్కొక్కటిగా తెరుస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు 26 గేట్లుంటే ఉదయం ఏడున్నరకు నాలుగుగేట్లు తెరిచారు. ఇప్పుడు ఏకంగా 20 గేట్లు తెరిచారు.

Next Story

RELATED STORIES