ఫిష్ కర్రీ తింటూ.. ప్రాజెక్ట్‌ అందాలను చూస్తూ..

ఫిష్ కర్రీ తింటూ..  ప్రాజెక్ట్‌ అందాలను చూస్తూ..

ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో జూరాల ప్రాజెక్ట్‌ కళకళలాడుతోంది. గేట్లు ఎత్తేయడంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరడగంతో అక్కడ చిరు వ్యాపారాలు జోరందుకున్నాయి. ప్రాజెక్ట్‌ సమీపంలో దొరికే చేపలే ఇక్కడ స్పెషల్‌ ఫుడ్‌. డ్యామ్‌ అందాలను చూస్తూ రుచిగా ఉండేఫిష్ కర్రీ , ఫ్రై, పులుసును లాగిస్తూ పర్యాటకులు ఎంజాయ్‌ చేస్తున్నారు.

దాదాపు పదేళ్ల తర్వాత జూరాక ప్రాజెక్ట్‌ వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ఇక్కడ దాదాపు 12 రకాల చేపలు దొరుకుతాయి. తాజాగా దొరికే చేపల్ని ఓ పట్టుపట్టేందుకు సుదూర ప్రాంతాలనుంచి పర్యాటకులు క్యూ కడుతున్నారు. డ్యామ్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ... చేప ముక్కను కొరికితే ఆ ఎంజాయ్‌మెంట్‌ ఎక్కడా దొరకదంటున్నారు విజిటర్స్‌.

జూరాలకు వచ్చిన జలకళ వల్ల ఇక్కడ వందల మంది ఉపాధి పొందుతున్నారు. డ్యామ్‌ వద్ద చేపలు పడుతూ మత్స్యకారులకు వలనిండా పనిదొరుకుతోంది. ఇక వీటిని వండివార్చి ఉపాధి పొందుతున్నారు చిరు వ్యాపారులు. ఇక్కడ దొరికే తాజా చేపలు చాలా రుచిగా ఉంటాయంటున్నారు వ్యాపారులు.

Tags

Read MoreRead Less
Next Story