కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైకో

కశ్మీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైకో
X

తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే MDMK చీఫ్‌ వైకో మరోసారి రెచ్చిపోయారు. కశ్మీర్‌పై వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వందవ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి కశ్మీర్‌ ఇండియాలో ఉండదని ఆయన జోస్యం చెప్పారు.

బీజేపీపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు వైకో. వాళ్లు కశ్మీర్‌పై బురద చల్లారని వైకో ఎద్దేవా చేశారు. కశ్మీర్‌పై గతంలో కూడా తన అభిప్రాయం చెప్పానన్నారు. కశ్మీర్‌పై కాంగ్రెస్‌ది 30 శాతం తప్పయితే , బీజేపీది 70 శాతం తప్పన్నారు వైకో.

Tags

Next Story