ఎగువ నుంచి వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత..

ఎగువ నుంచి వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత..

ఎగువన పులిచింతల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో.. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచారు. 70 గేట్లను పైకి ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 10 అడుగులు ఉంది. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పరిస్థితిని బట్టి తర్వాతి నిర్ణయం తీసుకోనున్నారు. బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 3.05 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 2.5 టీఎంసీల నీరుంది. ప్రస్తుతానికి కృష్ణా నదికే భారీగా వరద ఉన్నందున.. పట్టిసీమ నుంచి నీటిని ఆపేశారు. పులిచింతల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఔట్‌ఫ్లో ఉండడంతో ఆ వరదంతా ప్రకాశం బ్యారేజీకే చేరుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన వరద వచ్చినట్టు సముద్రంలోకి వదిలేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story