Top

తాతాజీ కుటుంబాన్ని ఆదుకోండి.. కలెక్టర్‌కు జర్నలిస్టుల వినతి

తాతాజీ కుటుంబాన్ని ఆదుకోండి..  కలెక్టర్‌కు జర్నలిస్టుల వినతి
X

తూర్పుగోదావరి జిల్లా టీవీ5 స్టాఫ్‌ రిపోర్టర్‌ తాతాజీ మృతి మీడియా రంగానికి తీరని లోటన్నారు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు. రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌లో తాతాజీ సంతాప సభ నిర్వహించారు. ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో సీసీసీ కేబుల్‌ నెట్‌ వర్క్‌ ఎండీ పంతం కొండరావుతో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తాతాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాతాజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాతాజీ మరణం కలచి వేసిందన్నారు.

అటు అమలాపురంలోనూ తాతాజీకి ఘన నివాళలర్పించారు. స్థానిక పంచాయతీ రాజ్‌ గెస్ట్‌ హౌస్‌లో జరిగిన సంతాప సభలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. తాతాజీ మృతి బాధాకరం అన్నారు.

తాతాజీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి. తాతాజీ ఏడేళ్ల కుమారుడికి కార్పోరేట్‌ స్కూల్‌లో ఉచిత విద్యనందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తాతాజీ కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డికి జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు.

Next Story

RELATED STORIES