మానవత్వం పరిమళించే..

మానవత్వం పరిమళించే..
X

వర్షాలు రాకపోతే వరుణుడు కరుణించట్లేదంటారు. జోరున కురుస్తున్న వర్షం తగ్గకపోతే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనం అతలాకుతలం అంటారు. ఏదొచ్చినా తట్టుకోవడం కష్టం. మనుషులమైతే మరొకరితో చెప్పుకుంటాం. సాయం కోసం అర్థిస్తాం. మరి మూగజీవాల పరిస్థితి. ఎండైనా వానైనా యజమాని ఎక్కడ కట్టేస్తే అక్కడే ఉంటాయి. వరదలొస్తే అందరూ వలసలు పోతుంటారు. బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చనుకుంటారు. పదిమందికి కేటాయించిన షెల్టర్లలో పాతికమందైనా ఉంటారు కానీ పశువులను కట్టేసే స్థలం ఉండదు. అలానే వదిలేయాలంటే ఆ అబ్బాయికి ప్రాణం వప్పట్లేదు. తనతో పాటే తీసుకెళ్లాలనుకున్నాడు. కన్నతల్లిలా పాలిచ్చి పెంచుతున్న పాడి ఆవుని కాపాడుకున్నాడు. దాని బిడ్డని కూడా ఒడ్డుకి చేర్చాలని తన వీపు మీద ఎక్కించుకున్నాడు. వరదల్లో ఎందుకురా నాయినా వలేయరాదూ అని తల్లి వారిస్తున్నా వినకుండా.. తనవెంటే తీసుకుని వెళుతున్నాడు. అమ్మా.. నేను రాకపోతే నువ్వెలా వెళ్లలేవో దూడ రాకపోతే ఆవు కూడా అడుగు వేయలేదు. బిడ్డ కోసం తల్లి పడే తపన.. నాకంటే నీకే బాగా తెలుసంటూ.. కష్టమనైనా ఇష్టంగానే ఆవు దూడను అమ్మ దగ్గరకు చేర్చాడు.

Next Story

RELATED STORIES