Top

సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును చేధించిన పోలీసులు

సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును చేధించిన పోలీసులు
X

నెల్లూరులో సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ భారీ చోరీ జరిగింది. అప్పటి నుంచి పలు కోణాల్లో.. దర్యాప్తు చేపట్టిన నెల్లూరు పోలీసులు.. చోరీ చేసిన ముఠాను గుర్తించారు. చోరీకి పాల్పడ్డ ఆరుగురు జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. సుమారు రూ. 4 కోట్ల 80 లక్షల విలువైన సెల్‌ఫోన్ల కంటైనర్‌ను ఈ ముఠా చోరీ చేసింది.

ఆరు నెలల పాటు స్మగ్లర్ల కోసం గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఆ కంటైనర్ ను బంగ్లాదేశ్ కు తరలించినట్టు గుర్తించారు. వారి దగ్గర నుంచి 70 లక్షల నదగు, ఓ లారీ, కారు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Next Story

RELATED STORIES