రాజోలు ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌ను ఖండించిన చంద్రబాబు

రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే రాపాకను అరెస్ట్‌ చేయడం గర్హనీయమన్నారు. జమీన్‌ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌పై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లకు ఒక న్యాయం.. ఇతరులకో మరో న్యాయమా అని ప్రశ్నించారు.

ఏపీలో చట్టం వైసీపీ నేతలకు చుట్టంగా మారిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేసిన వారిపై, ఏడుగురు టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేసిన వారిపై చర్యలేవని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో చట్టం ఒక్కో చోటా ఒక్కోలా ఉంటుందా..? పార్టీలను బట్టి చట్టం మారుతుందా..? అని ప్రశ్నించారు. పార్టీ బట్టి, వ్యక్తులను బట్టి అరెస్టులు చేయడమేంటని మండిపడ్డారు. ఇలాంటి వివక్ష చర్యల వల్ల చట్టంపై ప్రజల్లో విశ్వాసం పోతుందన్నారు చంద్రబాబు.

Also Watch :

Read MoreRead Less
Next Story