ఛాయ్ పత్తీ ఎంత స్ట్రాంగ్.. రేటు కూడా.. కిలో రూ.75,000 మరి

ఛాయ్ పత్తీ ఎంత స్ట్రాంగ్.. రేటు కూడా.. కిలో రూ.75,000 మరి
X

ప్రతి ఉదయం వంటింట్లోని ఛాయ్ ఘుమ ఘుమలతో మొదలవుతుంది. ఓ కప్పు వేడి వేడి కాఫీ తాగితే ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ రోజు పనులు కాఫీ కప్పుతోనే మొదలవుతాయి. మాంచి వాసన వచ్చే స్ట్రాంగ్ ఛాయ్ కావాలంటే కిలో వెయ్యి వరకు ఉండొచ్చేమో అనుకుంటాం. కానీ ఛాయ్ పత్తీ ధరలు కూడా ఆకాశాన్నంటేస్తున్నాయి. వినియోగదారుడి టేస్ట్‌ని దృష్టిలో పెట్టుకుని రకరకాల ఛాయ్ పత్తీలు మార్కెట్లోకి వస్తుంటాయి. తేయాకు పంటకు ప్రసిద్ధి చెందిన అస్సాం రాష్ట్రంలోని దిబ్రుగార్ష్ జిల్లాలో ఉన్న దాకామ్ టీ ఎస్టేట్‌కు చెందిన టీ పౌడర్ కేజీ రూ.75 వేలు పలికింది. గౌహతి ఆక్షన్ సెంటర్‌లో మంగళవారం ఈ రికార్డు నమోదైంది. ఎమ్మెస్ అస్సాం టీ ట్రేడర్స్ రూ.75 వేల రూపాయలకు ఈ టీ పౌడర్‌ని సొంతం చేసుకున్నారు. ప్రత్యేకంగా పండించే ఈ టీ ఎస్టేట్ మేనేజర్ సమర్ జ్యోతి చాలిహ మాట్లాడుతూ.. ఈ రోజు మా టీం చాలా సంతోషిస్తుంది. డికామ్ టీ ఎస్టేట్ రూ.75 వేలకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఏళ్లుగా నాణ్యమైన టీ పౌడర్‌ని అందిస్తున్నాం. మా కృషికి తగిన గుర్తింపు లభించింది అని అన్నారు.

Next Story

RELATED STORIES