ఉగాది రోజున ప్రతి నిరుపేదకు ఒకటిన్నర సెంట్ల ఇంటి స్థలం : సీఎం జగన్

X
TV5 Telugu15 Aug 2019 6:20 AM GMT
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. డ్యూటీలో సాహసం చూపిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. 13 శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అవినీతి రహిత పాలన అందిస్తామని సీఎం జగన్ అన్నారు. 104, 108 వ్యవస్థను గాడిన పెట్టబోతున్నామని చెప్పారాయన. జనవరి ఫస్ట్ నుంచి కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయని స్పష్టంచేశారు. ఉగాది రోజున ప్రతి నిరుపేదకు ఒకటిన్నర సెంట్ల ఇంటి స్థలం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు.
Next Story