వారికి అంత సీన్ లేదు : మంత్రి తలసాని

వారికి అంత సీన్ లేదు : మంత్రి తలసాని

తెలంగాణ రాజకీయం అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాతే మిగిలిన పార్టీలు. అది కూడా సపోర్టింగ్ రోల్ కు తప్ప వాటి వల్ల వచ్చేది లేదు పోయేది లేదు అనే ఫీలింగు ఉండేది. కానీ, అమిత్ షా కనుచూపుల్లో తెలంగాణ బీజేపీ బూస్టప్ అవుతోంది. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇవ్వటంతో పాటు ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటూ రాష్ట్రంలో పాజిటీవ్ వేవ్స్ క్రియేట్ చేసుకుంటోంది. ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ 2024లో సీఎం కుర్చీ కైవసం చేసుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను కూడదీసుకుంటున్న కమలం నేతలు..అటు పొలిటికల్ రింగ్ లో తమ వాయిస్ గట్టిగానే వినిస్తున్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకుండా అడ్డుకుంటోందన్నది బీజేపీ ఆరోపణ. అంతేకాదు..ఈనెల 18న బీజేపీలో 20వేల మంది చేరుతున్నారని కూడా చెబుతోంది.

అయితే..బీజేపీ జోరుకు ఇప్పటినుంచే స్పీడు బ్రేకులు వేస్తోంది టీఆర్ఎస్. టీఆర్ఎస్ తామే ప్రత్యమ్నాయమని కమలం నేతలు చెబుతుంటే వారికి అంత సీన్ లేదంటూ మంత్రి తలసాని కౌంటర్ ఇచ్చారు. తమకు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీ అని అన్నారాయన. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉన్నంత ఓటుబ్యాంకు భాజపాకు లేదన్నది ఆయన లాజిక్. అంతేకాదు..కాలం చెల్లిన నేతల చేరికతో బీజేపీకి ఒరిగేదేమీ లేదన్నారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారన్న ప్రచారాన్ని కూడా తలసాని కొట్టిపారేశారు.

Tags

Read MoreRead Less
Next Story