బాలికపై అఘాయిత్యం.. తప్పించుకున్న మరో బాలిక

X
TV5 Telugu16 Aug 2019 1:07 AM GMT
వరంగల్‌లో కామాంధునికి ఉరి శిక్ష పడినా, మృగాళ్లలో మార్పు రావడం లేదు. అన్నెం పున్నెం ఎరుగని బాలికల జీవితాలతో ఆడుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన దుండగులు చివరకు దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
చింతూరు ఏజెన్సీలో గత నెల 11న దుండగులు ఓ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. అంతటితో ఆగకుండా ఆ బాలికను అతిదారుణంగా హత్య చేశారు. అయితే అదే రోజున మరో బాలిక వీరి చెర నుంచి తప్పించుకొంది. అక్కడ జరుగుతున్న అకృత్యాలు అన్నిటినీ బయటపెట్టింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Watch :
Next Story