ఉస్మానియా వర్సిటీ లేడీస్ హాస్టల్‌లోకి అగంతకుడు

హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ లేడీస్ హాస్టల్‌లోకి అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లోని ఓ విద్యార్థిని.. అపరిచిత వ్యక్తి తచ్చాడుతుండడం గమనించింది. భయపడి వెంటనే బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ వేసుకుంది. కేకలు పెట్టింది. దీంతో.. అగంతకుడు బాత్‌రూమ్ గోడపైనుంచి లోపలికి వెళ్లి.. కత్తితో ఆమెను బెదిరించాడు. చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఈ కేకలు విన్న మిగతా విద్యార్థినులు బయటకు రావడంతో.. ఫస్ట్‌ఫ్లోర్ నుంచి దూకేశాడు. హాస్టల్ వెనుక గేట్ నుంచి పారిపోయాడు. ఇప్పుడీ ఘటన సంచలనం సృష్టించింది.
వుమెన్స్ హాస్టల్‌లోకి దుండగుడు వచ్చాడన్న విషయంపై ఫిర్యాదు రావడంతోనే OU పోలీసులు స్పందించారు. వెంటనే డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించింది. ఐతే.. వెనుకవైపు సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడు ఎవరు అన్నది నిర్థారించుకునేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Also Watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com