కక్షతో వారి కడుపు కొట్టొద్దు - లోకేశ్

తెలుగుదేశంపై కక్షతో ఏం చేసినా ఫర్వాలేదు.. కానీ పేదల కడుపుకొట్టొద్దన్నారు చంద్రబాబు. అన్నా క్యాంటీన్లు మూసివేయడం ద్వారా పేదలను కష్టపెట్టడాన్ని తాము సహించలేకపోతున్నామని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం వారి కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్లు తాము పెడితే.. కక్షతో మూసేయడం దారుణమన్నారు. వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ దీక్షలు, ధర్నాలకు పిలుపినిచ్చినట్టు తెలిపారు. అన్నా క్యాంటీన్లు తెరిచేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు చంద్రబాబు.
జగన్ పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. కక్ష సాధింపు రాజకీయాలు మానుకుని.. వెంటనే అన్నా కాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీర్చాలని డిమాండ్ చేశారు. గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకోవాలని కానీ.. ఇలా కక్షతో పేదల కడుపు కొట్టొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక్క అన్నా క్యాంటీన్ మూసివేస్తే వేయిపాపాలతో సమానమన్నారు లోకేష్.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నాకాంటీన్లను ప్రభుత్వం మూసివేసింది. 5 రూపాయలకే భోజనం పెడుతున్న అన్నా కాంటీన్లు మూసేయడం ద్వారా పేదలు కడుపు కొట్టినట్టు అయిందని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు కొంతకాలంగా ఆందోళన బాటపట్టాయి. లోకేష్ కూడా అన్నా కాంటీన్లు మూసివేయడంపై తరచుగా ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం ఎన్టీయార్ పేరుందని.. చంద్రబాబు వాటిని ప్రారంభించారన్న కక్షతోనే జగన్ ప్రభుత్వం మూసివేసిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
.@ysjaganగారూ! మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజల ఋణం తీర్చుకునేలా ఉండాలి పాలన. కానీ మీ పాలన ఇన్నాళ్ళూ మిమ్మల్ని అధికారానికి దూరం పెట్టినందుకు కక్ష సాధింపులా ఉంది. అన్న క్యాంటీన్ల మూసివేత ఒక్కటి చాలు, వేయి పాపాల పెట్టు. వాటిని తిరిగితెరచి పేదల ఆకలి తీర్చండి చాలు.#ReOpenAnnaCanteens pic.twitter.com/hEB7yWDkr2
— Lokesh Nara (@naralokesh) August 16, 2019
తెదేపా మీద కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది తెదేపా. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం. #ReOpenAnnaCanteens pic.twitter.com/cEsZMLCHQU
— N Chandrababu Naidu (@ncbn) August 16, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com