తారలు.. వారి చదువులు..

తారలు.. వారి చదువులు..
X

డాక్టర్ చదివి యాక్టర్ అయిన అప్పటి రాజశేఖర్.. ఇప్పటి సాయి పల్లవి నటనలో కూడా రాణిస్తున్నారు. నటనను ప్యాషన్‌గానే తీసుకున్నా ఇచ్చిన పాత్రకు ప్రాణం పెడుతున్నారు. అభిమానులకు ఆరాధ్య నటులవుతున్నారు. మరి కొందరు నాయికీమణులు ఏం చదువుకున్నారో చూద్దాం..

కేరళ కుట్టి అందాల నయనతార నార్త్‌లో చదువుకుంది. మళయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. మార్దోమా కాలేజ్‌లో బీ.ఏ పూర్తి చేసింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మళయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనస్సినక్కరే అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు అవకాశం ఇచ్చారు. ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చి ఒక్క సినిమాతో వెళిపోదామనుకుంది. కానీ అభిమానులు ఆమె నటనకు ఫిదా అయ్యారు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న తారల్లో నయన్ ఒకరు.

బెంగుళూరు స్వీటీ ఈ అనుష్క శెట్టి. కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది. యోగా టీచర్ అయిన అనుష్క సూపర్ సినిమాతో నాగార్జున సరసన నాయికగా నటించింది. సినిమాల్లో మొదటి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాతోనే.

ఇక అక్కినేని వారింటి కోడలుగా సర్టిఫికెట్ పొందిన సమంత చెన్నైలోని స్టెల్లా మెరీ కాలేజ్‌లో కామర్స్‌లో డిగ్రీ చేసింది. మిల్కీ బ్యూటీగా ముద్ర పడిన తమన్నా ముంబయిలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో చదువుకుంది. ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. త్రిష చెన్నైలోని ఉమెన్స్ కాలేజీలో బీబీఏ చదివింది. కాజల్ అగర్వాల్ కేసీ కళాశాలలో మాస్ మీడియా కమ్యూనికేషన్‌లో మార్కెటింగ్ విభాగంలో పట్టా పుచ్చుకుంది. రకుల్ ప్రీత్ కన్నడ సినిమా గిల్లీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదివింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గణితంలో మాస్టర్స్ చేసింది. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ముంబయి కాలేజీలో సైకాలజీ చేసింది. పూజాహెగ్డే కర్ణాటకలో MMK కాలేజీలో M.Com చదివింది. రష్మిక మందన్నా సైకాలజీలో డిగ్రీ చేసింది. నిధి అగర్వాల్ బెంగళూరుకు చెందిన క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. నభా నటేష్ మంగళూరులో సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

Next Story

RELATED STORIES