కశ్మీర్ అంశంపై ఐరాసలో సీక్రెట్‌ మీటింగ్‌

కశ్మీర్ అంశంపై ఐరాసలో సీక్రెట్‌ మీటింగ్‌

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్‌ రద్దు చేయడంపై ఇవాళ (శుక్రవారం ) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. చైనా ఒత్తిడితో సీక్రెట్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక బృందం నేతృత్వంలో ఇవాళ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడు జోనా రోనెకా.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడమే ఆలస్యం..తను భూభాగాన్ని లాక్కున్నట్లు పెడబొబ్బలు పెట్టిన పాకిస్తాన్‌...అన్ని దేశాల ముందు మొసలి కన్నీరు కార్చింది. కశ్మీర్‌ విషయంపై స్పందించాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని బతిమాలుకుంది. కానీ ఏ దేశం కూడా పాక్‌ను సపోర్ట్‌ చేయని పరిస్థితి. దీంతో చేతులెత్తిసిన పాకిస్తాన్‌... చివరకు కశ్మీర్‌ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి లేఖ రాశారు. దీనికి మద్దతివ్వాలని చైనాను కోరారు. దీంతో వెంటనే కశ్మీర్‌పై అంతర్గత సమావేశం ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో రహస్య చర్చ జరిపేందుకు భద్రతా మండలి సిద్ధమైంది.

ఆర్టికల్‌ 370 రద్దుపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన చైనా... పాక్‌కు బహిరంగ మద్దతుతో దాని వక్ర బుద్ధి కూడా బయటపడింది. కశ్మీర్‌పై రహస్య సమావేశం చాలా అరుదుగా చెబుతున్నారు దౌత్యవేత్తలు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story