Top

ఏపీలో పెట్టుబడులపై వారితో చర్చించనున్న సీఎం జగన్

ఏపీలో పెట్టుబడులపై వారితో చర్చించనున్న సీఎం జగన్
X

ఏపీ సీఎం జగన్ ఆరు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు. వాషిం‍గ్టన్‌ డీసీలో భారత ఎంబసీ సీనియర్‌ అధికారులు జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. అలాగే ఎయిర్‌పోర్టులో ప్రవాసాంధ్రులు కూడా ఏపీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అమెరికా- ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో జగన్ భేటీ అవుతారు. ఏపీలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. అనంతరం భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.

సీఎం జగన్ రేపు డల్లాస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. 18న వాషింగ్టన్‌ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆగస్టు 22న షికాగోలో మరికొందరు ప్రతినిధులతో భేటీ ఏపీలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలపై వివరించనున్నట్టు తెలుస్తుంది. అనంతరం ఆయన ఏపీకి తిరిగిరానున్నారు.

Next Story

RELATED STORIES