వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే

X
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కృష్ణా నదికి వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తున్న అధికారులు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
