పెద్దఎత్తున బీజేపీలో చేరనున్న టీడీపీ కార్యకర్తలు

ఎన్నికలు ముగిసి ముగియగానే తెలుగు రాష్ట్రాల పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక వ్యూహం అమలు చేస్తోంది బీజేపీ. పెద్ద లీడర్లను పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ లక్ష్యంలో ఇప్పటికే కొద్దిమేర సక్సెస్ అయ్యింది. చేరికలను మరింత ప్రొత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
పార్టీ అధ్యక్షుడి పర్యటన కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర నాయకత్వం. దాదాపు 20 వేల మంది టీడీపీ కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించింది. టీడీపీ రాష్ట్ర స్థాయి నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.
అయితే.. బీజేపీకి వలసలతో కలిగే ప్రయోజనం ఏమి ఉండదనేది టీఆర్ఎస్ వాదన. ఇతర పార్టీల్లోని కేడర్ లేని లీడర్లను తీసుకొని మురిసిపోతున్నారనే టీఆర్ఎస్ విమర్శలను బీజేపీ తప్పుబట్టింది. రాష్ట్రంలో బీజేపీ బలం ఏంటో ఎన్నికల్లో తేలుతుందని అంటున్నారు.
ఈ నెల 18ని బీజేపీ బిగ్ డే భావిస్తోంది. జేపీ నడ్డా ఆధ్వర్యంలో భారీ వలసలు ఉండటంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగబోయే సభను సవాల్ గా తీసుకుంటోంది రాష్ట్ర నాయకత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com