తిరుపతిలో బిబిఎ విద్యార్థి హత్య కేసును చేధించిన పోలీసులు

తిరుపతిలో బిబిఎ విద్యార్థి హత్య కేసును చేధించిన పోలీసులు
X

తిరుపతిలో సంచలనం సృష్టించిన బిబిఎ మూడో సంవత్సరం విద్యార్థి ద్వారకానాథ్‌ హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన స్నేహితుడు అశోక్‌ను తిట్టినందుకు కార్తీక్‌పై ద్వారకానాథ్‌ చేయిచేసుకున్నాడు. దీంతో కోపోధ్రిక్తుడైన కార్తీక్‌ పక్కా ప్లాన్‌ వేసి 8 మంది స్నేహితులతో కలిసి బీర్‌ బాటిళ్లతో ద్వారకానాథ్‌ను కొట్టి చంపాడు. ఈ నెల 5న ద్వారకానాథ్‌ను రేణిగుంట రోడ్డులోని శెట్టిపల్లి రైల్వే గేట్‌ వద్ద హత్య చేశారు. 12 రోజులుగా నిందితులు పరారీలో ఉన్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.

Next Story

RELATED STORIES