ఏటీఎం చోరీకి యత్నించి.. బైక్‌తో పరార్!

హైదరాబాద్‌లో ఇద్దరు దొంగలు ఏటీఎంకి కన్నం వేద్దామనుకున్నారు. దాన్ని బద్దలుకొట్టేసి, డబ్బులు ఎత్తుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఐనా కుదర్లేదు. చివరికి నిరాశగా బయటకు వచ్చేశారు. ఎలాగూ దొంగతనం చేయాల్సిందేనని గట్టిగా ఫిక్సై వచ్చారు కాబట్టి ATMలో డబ్బు దొరక్కపోతేయేం అనుకున్నారు. అక్కడే పార్క్ చేసిన ఓ బైక్ చోరీ చేసి పరారయ్యారు. బాగానే తప్పించుకున్నామని రిలాక్స్ అయ్యారు. కట్ చేస్తే.. ప్రస్తుతం ఆ ఇద్దరూ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో జరిగిందీ ఘటన.
పాతబస్తీకి చెందిన మహ్మద్ అసద్, అబ్దుల్ అసద్ జల్సాలకు బాగా అలవాటు పడ్డ బ్యాచ్. ఈజీ మనీ కోసం ఎన్నో అడ్డదార్లు తొక్కారు. పలుసార్లు జైలుకు వెళ్లొచ్చినా బుద్ధి మారలేదు. తాజాగా పతర్‌గట్టి ప్రాంతంలోని ATMలో డబ్బులు దొంగతనానికి ప్రయత్నించారు. ఐతే.. వీళ్ల కదలికలన్నీ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. దాదాపు 2 గంటలు ATM బద్దలు కొట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ఈ ఫుజేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com