పెళ్లి వేడుకలో భారీ పేలుడు.. 40 మంది మృతి

X
TV5 Telugu18 Aug 2019 3:21 AM GMT
అప్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఓ పెళ్లి వేడుకలో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనలో 40 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పేరిగే అవకాశం ఉంది.
వివాహ వేడకలో వందల మంది గుంపుగా ఉన్న సమయంలో దుండగుడు ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక ఇస్లాం ఉగ్రవాద ముఠాలతో కలిసి తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని అప్గానిస్థాన్ అధికారులు భావిస్తున్నారు. పదిరోజుల వ్యవధిలో ఇది రెండో భారీ ఉగ్రదాడిగా వారు పేర్కొంటున్నారు.
Next Story