అందుకే ఉపాధి పెరిగి, రాష్ట్ర ఆదాయం పెరిగింది.. సీఎం కేసీఆర్

అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా తమ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ సీఎండీ రాజీవ్ శర్మ .... సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర విద్యుత్ పరిస్థితులపై చర్చ జరిగింది. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దేందుకు సమగ్ర వ్యూహం అనుసరించామన్నారు సీఎం కేసీఆర్. 6 నెలల్లో విద్యుత్ కోతలు ఎత్తివేశామన్నారు. ఇప్పుడు అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్న సీఎం కేసీఆర్... దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రగతికి నాడు విద్యుత్ సమస్యే తీవ్ర అవరోధమన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ప్రస్తుతం పరిశ్రమలు.... 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నాయన్నారు. అందుకే ఉపాధి పెరిగి, రాష్ట్ర ఆదాయం కూడా పెరిగిందన్నారు. దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలన్నారు సీఎం కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com