బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేసిన పెయింటర్

బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేసిన పెయింటర్
X

విశాఖలో ఓ రేపిస్ట్ పాశవికంగా ప్రవర్తించాడు. మైనర్ జీవితాన్ని పాడుచేశాడు. పైగా దీనికి అతని భార్య కూడా సహకరించింది. దారుణమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విశాఖలోని గోపాలపట్నం పీఎస్ పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

నిందితుడు రవిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో ముందుగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీనిపై.. మహిళాసంఘాలు ఆందోళనకు దిగడంతో చివరికి కేసు నమోదు చేశారు. బాధిత బాలిక, ఆమె తల్లి.. శుక్రవారం నుంచి కనిపించకుండా పోవడం వెనుక రవి హస్తం ఉందని బాలిక నాన్నమ్మ అనుమానిస్తోంది. శిక్ష నుంచి తప్పించుకునేందుకే.. ఇద్దరినీ కిడ్నాప్ చేశారని, బెదిరించి కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారని అంటోంది. పోలీసులు ఇప్పటికైనా వేగంగా విచారణ చేసి.. తన మనవరాలి ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటోంది.

మహిళా సంఘాల ధర్నాలతో విషయం ఇంకాస్త పెద్దది కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి నివాసంతోపాటు, నిందితుడు రవి ఇంట్లోనూ సోదాలు చేశారు. చుట్టుపక్కల వాళ్లను కూడా విచారించారు. ఐనా.. ఎలాంటి సమాచారం లభించకపోవడంతో.. కాల్‌డేటాపై దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా కేసు కొలిక్కి వస్తుందని బాధితకుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు చెప్తున్నారు. ఐతే.. రవికి రాజకీయ నేతల అండ ఉందని, తప్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నాడని నేతాజీనగర్ వాసులు చెప్తున్నారు. మాయమాటలతో బాలికను లోబరుచుకున్న ఉన్మాది.. ఆమెను గర్భవతిని చేశాడని అంటున్నారు. తీరా విషయం బయటపడడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడంటున్నారు. అదృశ్యమైన బాలిక, ఆమె తల్లి ఎక్కడున్నారో తెలిస్తే.. రవి అరాచకాలన్నీ బయటకు వస్తాయంటున్నారు.

Next Story

RELATED STORIES