తాజా వార్తలు

టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ తోక పార్టీ : బీజేపీ

టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ తోక పార్టీ : బీజేపీ
X

తెలంగాణ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసిన పార్టీ టీఆర్ఎస్. ట్రెండ్ తీరగరాస్తామంటూ దూసుకొస్తున్న పార్టీ బీజేపీ. పాత వైభవం కోసం పాకులాడుతున్న పార్టీ కాంగ్రెస్. అయితే.. అధికార పార్టీకి ధీటుగా నిలబడబోయే ప్రతిపక్ష పార్టీ ఏది? వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఖంగుతినిపించేంత సీన్ ఎవరికి ఉంది? ఎన్నికలకు ఇంకా చాన్నాళ్ల సమయం ఉన్నా..ఇప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీలు డైలాగ్ రేసులో ముందుంటున్నాయి. 2024లో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం మేమే అంటే కాదు మేమే అంటూ పోటీపోటీగా చెబుతున్నాయి కాంగ్రెస్, బీజేపీ.

అధికారమే లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసుకున్న ప్రతిపక్ష పార్టీలు..అటు అధికార పార్టీ లోపాలను ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకెళ్తూనే మిగిలిన పార్టీల్లో తామే బెస్ట్ అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులోభాగంగా ఇతర ప్రతిపక్ష పార్టీలపైనా విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు‌ సరైన ప్రత్యామ్నయం బీజేపీ.. కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌తో అంటకాగుతోందన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు.

అటు కాంగ్రెస్ కూడా బీజేపీకి అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు తప్పుబట్టింది. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు కలిసే ఉన్నాయని అంటున్నారు. ప్రత్యామ్నాయంలో మేమే ముందున్నామని చెప్పుకుంటున్న ఈ రెండు పార్టీలు.. జనంలోకి అదే సంకేతాలు వెళ్లేలా జాగ్రత్త పడుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేకత తమకే కలిసొచ్చేలా ముందుజాగ్రత్తలో ఉన్నారు.

Next Story

RELATED STORIES