కూతురిపై 15 సంవత్సరాలుగా తండ్రి లైంగిక దాడి

కూతురిపై 15 సంవత్సరాలుగా తండ్రి లైంగిక దాడి
X

సభ్య సమాజం తలదించుకునే ఘటన. కూతురిని కంటికి రెప్పలా కాపాడల్సిన తండ్రే పైశాచికంగా ప్రవర్తించాడు. కామంతో కూతురిపై కన్నెశాడు ఓ కసాయి. 15 సంవత్సరాలపాటు లైంగిక దాడి చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నాడు. దీనికితోడు బాధితురాలి తల్లి కూడా భర్తకే మద్దతు తెలపడంతో.. సమాజంలో నైతిక విలువలు ఎంతలా దిగాజారుతున్నాయో తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.

లక్నోకు చెందిన 21వ సంవత్సారాల యువతి.. తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 15 సంవత్సరాల నుంచి తన తండ్రి లైంగిక దాడి చేస్తున్నట్లు పోలీసుల ముందు వాపోయింది బాధితురాలు. తన చెల్లిని కూడా తండ్రి ప్రస్తుతం లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపింది. ఇంట్లో జరుగుతుందంతా తన తల్లికి తెలసినప్పటికీ.. తను తండ్రికి అడ్డుచెప్పటం లేదని వాపోయింది. తండ్రికి సహకరిస్తూ తనకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చేదని పోలీసుల ఎదుట వాపోయింది బాధితురాలు. దీంతో పోక్సో చట్టం 2012 కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం బాధితురాలి తల్లిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

RELATED STORIES