ఆనంద్ మహీంద్రా మనసు దోచిన 'ఛోళీ కే పీచే క్యాహై' డ్యాన్స్..

ఆనంద్ మహీంద్రా మనసు దోచిన ఛోళీ కే పీచే క్యాహై డ్యాన్స్..

ఎందుకండీ ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు. ఎంత బాస్ అయితే మాత్రం అలా ఉండాలని వుందా.. హాయిగా స్మైల్ ఫేస్‌తో ఉండొచ్చుగా. మిమ్మల్ని అలా చూస్తే మాక్కూడా వర్క్ చేయాలనిపించదు. ఆనంద్ మహీంద్రాలా ఆనందంగా. మంచి విషయాలను షేర్ చేస్తూ.. నవ్వు తెప్పించే విషయాలను నలుగురికీ పంచుతూ.. కంపెనీ సీఈవో అయినా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా.. తాను చూసిన ఆసక్తికర వీడియోలను సోషల్ మీడియా వేదికగా అందరికీ పంచేస్తుంటారు.

ఆనంద్ షేర్‌చేస్తే అందులో ఏదో విషయం కచ్చితంగా వుండే వుంటుంది అని ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తారు. ఆద్యంతం తిలకిస్తారు. ఆయన పోస్టులు ఓ పక్క నవ్విస్తూనే, మరోపక్క ఆలోచింపజేస్తుంటాయి. అమెరికాకు చెందిన కమెడియన్ క్యూపార్క్.. బాలీవుడ్ నటీనటుల స్టెప్పులను ఇమిటేట్ చేస్తూ న్యూయార్క్‌లోని రద్దీగా ఉన్న ఏరియాల్లో డ్యాన్స్ చేస్తున్నాడు. అతడి స్టెప్పులు వచ్చే పోయే వారికి వినోదాన్ని పంచుతున్నాయి. అసలే కమెడియన్ ఆపై వచ్చీ రాని స్టెప్పులు.. అయినా చూడాలనిపించేలా ఉంది అతడి డ్యాన్స్. బాలీవుడ్ ఫేమస్ పాటలైన ఛోళీ కే పీచే క్యా హై, ధూమ్ మచాలే, ప్రేమ్ రతన్ ధన్ పాయో.. పాటలకు స్టెప్పులను క్యూపార్క్ అనుకరించారు. పాత వీడియోనే అయినా ఆనంద్ మహీంద్రా షేర్ చేసే సరికి సరికొత్తగా అనిపిస్తుంది. చూసిందే అయినా మళ్లీ చూడాలనిపిస్తుంది. బాలీవుడ్ స్టెప్పుల్ని భలే వేస్తున్నావు బాస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story