అన్నయ్య గన్‌తో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. - పవన్

అన్నయ్య గన్‌తో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. - పవన్
X

హైదరాబాద్ శిల్పకళావేదికలో చిరు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌, అల్లు అరవింద్, జనసేన ఎమ్మెల్యే రాపాక సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. ఉద్వేగానికి లోనయ్యారు. కులం, మతం దాటి మానవత్వంవైపు ఆలోచించేలా బాధ్యతను గుర్తు చేసింది అన్నయ్యేనని చెప్పారు. నేను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు నిరాశ నిస్పృహలకు లోనయ్యా.. అన్నయ్య దగ్గరున్న పిస్తోలుతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. కానీ, అన్నయ్య చిరంజీవి చెప్పిన మాటలు నాలో విశ్వాసం నింపాయి అన్నారు పవన్. ఇప్పుడీ స్థితిలో ఉన్నానంటే అందుకు కారణం అన్నయ్య చిరంజీవే అన్నారు పవన్ కల్యాణ్. చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే ఏ ఇంట్లో ఆత్మహత్యలు జరగవని ఉద్వేగానికి గురయ్యారు పవన్.

Next Story

RELATED STORIES