జాతీయం

షాకింగ్.. 75 శాతం లివర్ చెడిపోయింది.. అయినా 20 ఏళ్లుగా..

షాకింగ్.. 75 శాతం లివర్ చెడిపోయింది.. అయినా 20 ఏళ్లుగా..
X

బాలీవుడ్ బిగ్ బీ.. ఎత్తైన విగ్రహం.. మాటలో గాంభీర్యం. సినిమా అయినా షో అయినా తన నటనతో, వాక్చాతుర్యంతో ఆధ్యంతం రక్తి కట్టిస్తారు. అభిమానులను ఆకట్టుకుంటారు. లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న అమితాబ్‌కి ఆల్కహాల్ అలవాటు లేకపోయినా లివర్ ప్రాబ్లం వచ్చింది. దాదాపు 75 శాతం లివర్ చెడిపోయింది. అయినా అలాగే కాలం గడుపుతున్నానని అమితాబ్ స్వయంగా వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. గతంలో క్షయ, హెపటైటిస్ బీ వంటి వ్యాధులతో పోరాడిన సంగతి గుర్తు చేసుకున్నారు. తనకు క్షయ ఉందన్న విషయాన్ని 8 ఏళ్లు ఆలస్యంగా గుర్తించానని చెప్పారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని అన్నారు. త్వరగా వ్యాధిని గుర్తించకపోతే దానికి చికిత్స కూడా చేయించుకోలేమని అన్నారు. 20 ఏళ్లుగా 25 శాతం లివర్‌తోనే బతికేస్తున్నానని అమితాబ్ బచ్చన్ లేఖ ద్వారా తెలియజేశారు.

Next Story

RELATED STORIES