మైనర్‌ బాలికపై గ్రామపెద్ద దాడి.. బాలిక తల్లిదండ్రులనూ విచారించిన..

మైనర్‌ బాలికపై గ్రామపెద్ద దాడి.. బాలిక తల్లిదండ్రులనూ విచారించిన..

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా దళిత మైనర్‌ బాలికపై దాడి కేసులో విచారణ కొనసాగుతుంది. గుమ్మగట్ట మండలం కేపీదొడ్డి గ్రామంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు నరహరి ప్రసాద్‌ పర్యటించారు. మైనర్‌ బాలిక, బాలుడి తల్లిదండ్రులను బహిరంగంగా విచారించారు. అలాగే గ్రామప్రజల అభిప్రాయాలనూ తెలుసుకున్నారు. దీనిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు పేర్కొన్నారు. మైనర్‌ బాలికపై గ్రామపెద్ద దాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. మైనర్లపై, దళితులపై ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు నరహరి ప్రభుత్వం తరపున రూ. 3లక్షల పరిహారం ప్రకటించారు.

మైనర్‌ బాలికపై రాక్షసత్వం చూపిన ఘటనపై తెలుగురాష్ట్రాల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దళిత మైనర్‌పై దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అటు దాడిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కూడా బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. పంచాయితీ పెద్దలైన లింగప్ప, బ్రహ్మానంద రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు పోలీసులు. కోర్టులో హాజరుపరచగా.. వారిని రిమాండ్‌కు ఆదేశించింది. మరోవైపు మైనర్‌ను ప్రేమించి ఆమెను లొంగదీసుకున్నాడని సాయి కిరణ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. అతడిపై కిడ్నాప్‌, రేప్‌ కేసులు నమోదు చేశారు. సాయి కిరణ్‌పై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story