నెల వయసున్న బాబుకు స్పీకర్ ఫీడింగ్

మాములుగా ప్రజా ప్రతినిధుల సభలు ఎలా ఉంటాయి. సభ్యుల వాగ్వాదాలు.. ప్రతిపక్షాల ఆరోపణలు.. అధికార పక్షాల వివరణలతో సభలు గందరగోళంగా కనిపిస్తాయి. చట్ట సభలు ఇలాంటి వాటికే కాదు అక్కడ విలువలకు, ప్రేమకు కూడా చోటుందని న్యూజిలాండ్ పార్లమెంట్ నిరూపించింది. ఏడుస్తున్న ఓ ఎంపీ కూమారునికి పాలు పట్టి స్పీకర్ ట్రెవోర్ మల్లార్డ్ తన మంచి మనసును చాటుకున్నారు. ఈ ఆసక్తికర ఘటనకు న్యూజిలాండ్ పార్లమెంట్ వేదికైంది. తమాటీ కోఫీ అనే ఎంపీ నెల వయసున్న తన కుమారుడిని పార్లమెంటుకు తీసుకొచ్చారు. అయితే చర్చలో భాగంగా ఆమె ప్రసంగించాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో చిన్నారి ఏడవడంతో అది గమనించిన స్పీకర్ ట్రెవోర్ మల్లార్డ్ పిల్లాడిని తన వద్దకు తీసుకురావాలని కోఫీని ఆదేశించారు. ఆ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని ఓదారుస్తు పాలు కూడా పట్టారు. అలా పాలు పడుతూనే సభను నిర్వహించారు.
దీనికి సంబంధించిన ఫోటోలను స్పీకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ స్పీకర్ కుర్చీలో అర్హత కలిగిన అధికారి మాత్రమే కూర్చుంటారు. కానీ ఓ అనుకోని అతిధి నాతో పాటు ఆ వేదికపై చేరాడు. మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి చేరినందుకు తమాటీ కోఫీ , టిమ్‌లకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. అవి సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల కామెంట్స్‌తో స్పీకర్‌ను తెగ పొగిడేశారు.అత్యున్యత స్ధాయిలో ఉండి ఓ చిన్నారికి ఫీడింగ్ ఇచ్చి నెటిజన్ల మనసు దోచుకున్నారు స్పీకర్ ట్రెవోర్ మల్లార్డ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com