చచ్చాన్రా దేవుడా.. బెడ్‌పై నాతో పాటు కొండ చిలువ..

చచ్చాన్రా దేవుడా.. బెడ్‌పై నాతో పాటు కొండ చిలువ..

అప్పుడే ఆఫీస్ ‌నుంచి వచ్చి అలసి పోయినట్టున్నాడు. హాయిగా బెడ్ ఎక్కేశాడు. కునుకు పడుతున్న సమయంలో ఎదో మెత్తగా తగులుతున్నట్టనిపించింది. పరుపే అనుకున్నాడు కానీ.. పామని ఎలా ఊహించగలడు. అది కదులుతుండేసరికి అప్పుడు కానీ అనుమానం రాలేదు. పామని తెలిసే సరికి పరుగో పరుగు. పాములు జనావాసాల మధ్యలో కనిపించడం పరిపాటై పోయింది ఈ మధ్య కాలంలో. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లోని బెడ్రూమ్‌లోకి దూరి బెడ్‌పై రెస్ట్ తీసుకుంటోంది ఓ పొడవాటి కొండ చిలువ.

ఇంతలో ఇంటి యజమాని ఆఫీస్ నుంచి వచ్చాడు. కాసేపు రెస్ట్ తీసుకుందామనుకున్నాడు. బెడ్‌పై నడుం వాల్చాడు. ఇంతలో నడుము కింద ఏదో మెత్తగా తగులుతున్నట్లు అనిపించింది. అంతగా పట్టించుకోలేదు. పదే పదే అదే ఫీలింగ్. లాభం లేదని లైట్ వేశాడు. బెడ్ అంతా తనదే అయినట్లు హాయిగా పడుకుంది ఓ కొండ చిలువ. అది చూసి వామ్మో.. చచ్చాన్రా దేవుడా అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా బయటకు పరిగెట్టేశాడు. వెంటనే స్కేక్ క్యాచర్ అసోసియేషన్‌కు ఫోన్ చేశాడు. వాళ్ల వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. ఇంతకీ ఎలా వచ్చిందో అని ఇంటిని పరికిస్తే బెడ్రూమ్‌కి ఉన్న సీలింగ్‌కి హోల్ ఉంది. దాన్నుంచి వచ్చి వుంటుందని అంచనా వేశారు. ఏది ఏమైనా కొండ చిలువకు ఆహారం కానందుకు ఇంటి యజమాని ఊపిరి పీల్చుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story