చిదంబరం ఆస్తులు ఆమెకు చెందేట్లు వీలునామా రాశారా?

చిదంబరం ఆస్తులు ఆమెకు చెందేట్లు వీలునామా రాశారా?
X

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టారా? ఆస్తులు మొత్తం ఆమెకు చెందేట్లు వీలునామాలు రాశారా? వందల కోట్ల ఆస్తులు దక్కేట్లు స్కెచ్‌ వేశారా? ఇంతకీ ఆమె ఎవరు? అవును చిదంబర రహస్యాల్లో చీకటి కోణాలెన్నో ఇప్పుడు బయటపడుతున్నాయి. చిద్దు పద్దు గుట్టు వీడుతోంది. అయితే ఇది తెలుసుకోవాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. వీలునామాలు, బినామీల బాగోతం తెలుసుకోవాల్సిందే.

ఏడాదిన్నర క్రితం చార్టర్డ్‌ అకౌంటెంట్‌ భాస్కర్‌ రామన్‌ అనే వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. ఈ అరెస్ట్‌ ఎందుకు జరిగిందనే ప్రశ్నకు సమాధానం కావాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలి. 2015 డిసెంబరులో ఈడీ.. ఆయనకు చెందిన ఓ లాకర్‌ను బలవంతంగా తెరిపించింది.అందులో 4 వీలునామాలు కనిపించాయి. అవి భాస్కర్‌ రామన్‌, సీబీఎన్‌ రెడ్డి, రవి విశ్వనాథన్‌, పద్మా విశ్వనాథన్‌ అనే వ్యక్తులకు చెందినవి. ఇందులో మరో విశేషాంశమేంటంటే అన్ని వీలునామాలూ ఒకేరూపంలో రెండుభాగాలుగా ఉన్నాయి. ఒక భాగంలో ఇళ్లు, ఆవాసాలు, నగలు, నగదు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు భార్యాబిడ్డలకు ఇస్తున్నట్లు ఉంది. ఇది సాధారణంగా అందరి విషయాల్లో జరిగేదే. ఇక రెండో దాంట్లో మాత్రం వీలునామా రాసినవారు ఓ రెండు కంపెనీల్లో ఉన్న తమ వాటాలను అదితి అనే అమ్మాయికి ధారాదత్తం చేస్తున్న ట్లు పేర్కొనడం అనేక ప్రశ్నలకు దారితీసింది.

అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, క్రియా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు వీటి అంతిమ లబ్ధిదారు అదితి అనే అమ్మాయి అని స్పష్టంగా పేర్కొన్నా రు. ఆమె డాక్టర్‌ శ్రీనిధి అనే మహిళ కుమార్తె అని.. డాక్టర్‌ బి.రంగరాజన్‌ అనే వ్యక్తికి మనవరాలనీ అందులో మెన్షన్‌ చేశారు. ఒకే రూపంలో ఉన్న నాలుగు వీలునామాల ద్వారా నలుగురు బినామీలు.. వందల కోట్ల విలువైన తమ ఆస్తుల్ని బి.రంగరాజన్‌ అనే వ్యక్తి మీద ఉన్న గౌరవాభిమానాలతో ఆయన మనవరాలు అదితి పేరిట రాశారు. ఇంతకీ ఈ అదితి ఎవరో కాదు. కార్తి చిదంబరం, సునిధి చిదంబరం దంపతుల కుమార్తె. అంటే మన కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం మనవరాలు. ఆమె పూర్తి పేరు అదితి నళినీ చిదంబరం. ఆమె బి.రంగరాజన్‌ మనవరాలన్న మాట కూడా నిజమే. ఎందుకంటే.. అదితి తల్లి సునిధికి తండ్రి ఆయనే. చిదంబరం రాజకీయ జీవితానికి ఇబ్బంది లేకుండా చేసేందుకే అదితికి ఆస్తులు రాసే పత్రాల్లో రంగరాజన్‌ పేరు రాశారు. మొత్తానికి చిదంబరం ఏకైక వారసురాలు అదితి కోసమే తాత, తండ్రి వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని వెనకేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Next Story

RELATED STORIES