ఇంజనీరింగ్ చదువుతూ.. చీప్‌గా ప్రవర్తిస్తూ.. ర్యాగింగ్‌ పేరుతో..

ఇంజనీరింగ్ చదువుతూ.. చీప్‌గా ప్రవర్తిస్తూ.. ర్యాగింగ్‌ పేరుతో..
X

సరదా, సంతోషాల మధ్య సాగాల్సిన ర్యాగింగ్‌ని అభాసుపాలు చేస్తున్నారు. సీనియర్లు జూనియర్లను ఆట పట్టిస్తూ సాగే ఒక వినోద వాతావరణాన్ని ర్యాగింగ్ పేరుతో కలుషితం చేస్తున్నారు. ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీలో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు కొత్తగా చేరిన విద్యార్థులకు ర్యాగింగ్ రుచి చూపించారు. వెల్‌కమ్ పార్టీ పేరుతో సీనియర్లు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జూనియర్ల చెంపలు వాయించారు. అనంతరం వారి దుస్తులు విప్పించి అర్థనగ్నంగా స్టేజి మీద డ్యాన్సులు వేయించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం కాస్తా ఆ రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 52 మంది విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. రూ.2,000ల జరిమానా కూడా విధించారు. యూనివర్సిటీలో ఇలా జరగడం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడ ఇలా చాలా సార్లు విద్యార్థులు ర్యాగింగ్‌కి పాల్పడుతూ పట్టుబడి సస్పెండ్ అయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయినా ఖాతరు చేయట్లేదు. భారీగా జరిమానాలు విధించినా, ఏడాది పాటు సస్పెండ్ చేసినా విద్యార్థుల్లో మార్పు రావట్లేదని యూనివర్సిటీ యాజమాన్యం తలలు పట్టుకుంటోంది.

Next Story

RELATED STORIES