ఫ్రెండ్స్‌కు సెల్ఫీ వీడియో పంపించి యువకుడు ఆత్మహత్యాయత్నం

X
TV5 Telugu23 Aug 2019 3:37 AM GMT
చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సై వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు దొంగతనం అంటగట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు సెల్ఫీ వీడియో పంపిన రమేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్నేహితులు.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
Next Story