రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం కేసులో మరో మలుపు

రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం కేసులో మరో మలుపు
X

సినీ నటుడు రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం కేసు మరో మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాజ్‌తరుణ్‌కు సంబంధించిన వీడియో, ఆడియో తన వద్ద ఉన్నాయని.. కార్తీక్‌ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు కొత్త వ్యవహారం తెరమీదకు వచ్చింది. 5 లక్షల రూపాయలు ఇస్తే సదరు వీడియో ఇస్తానని, లేని పక్షంలో సోషల్‌ మీడియాలో పెడతానంటూ ఫోన్‌ చేసి బెదిరించినట్లు రాజ్‌ తరుణ్‌ మేనేజర్.. సినీనటుడు రాజారవీంద్ర పేర్కొన్నారు.

రాజా రవీంద్ర మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్‌ అనే వ్యక్తి బ్లాక్‌ మెయిలర్‌ అని.. ఆయన అడిగిన రూ.5 లక్షలు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో కనీసం 3 లక్షలైనా ఇవ్వాలని బెదిరించాడని రాజారవీంద్ర చెప్పారు.

Next Story

RELATED STORIES