వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు

వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు

ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు ఫోక్స్‌ వ్యాగన్‌ కేసులో నోటీసులు జారీ చేసింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఈ‌ కేసులో సాక్షిగా ఉన్నారు. దీంతో వచ్చే నెల 12న కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.

2005లో ఫోక్స్ వ్యాగన్‌ కేసు నమోదైంది. అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై చాలా ఆరోపణలు వచ్చాయి. కార్ల కంపెనీని హైదరాబాద్ నుంచీ వైజాగ్‌కి తరలించాలనే అంశంపై బొత్స, మరికొందరికి పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకి ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 59మంది సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికే 3వేల పేజీల ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. దాదాపు రూ.7 కోట్ల వరకూ రికవరీ అవ్వగా... ఇంకా రూ.5కోట్ల 65లక్షలు రికవరీ కావాల్సి ఉంది.

ఫోక్స్ వ్యాగన్‌ను తరలించేందుకు.. వశిష్ట వాహన అనే నకిలీ కంపెనీని సృష్టించి.. దానికి పెట్టుబడులను మళ్లించడం ద్వారా పెద్ద కుట్ర జరిగిందని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పుడు ఇద్దరు నిందితులు మాత్రమే హాజరవుతున్నారు. వాళ్లు వశిష్ట వాహన కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ ఇద్దరిలో జైన్ అనే వ్యక్తి మూలకారకుడని తెలిసింది. ఇప్పుడు బొత్స ఏం చెబుతారన్నదాన్ని బట్టీ... సీబీఐ కోర్టు తగిన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story