తన ఇల్లే సిబ్బంది పిల్లల పెళ్లిళ్లకు వేదిక..!

తన ఇల్లే సిబ్బంది పిల్లల పెళ్లిళ్లకు వేదిక..!
X

భాజపా సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ తుది శ్వాస విడిచారు. మూత్రపిండాలు, క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూశారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న జైట్లీ ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండేవారు. తన సిబ్బందిని కూడా అరుణ్‌జైట్లీ ఆప్యాయంగా చూసుకునే వారు. దిల్లీలోని అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో జైట్లీ ఒకరు. తన దగ్గర పనిచేసే గుమాస్తాల విషయంలో జైట్లీ ఎంతో ఉదారంగా ఉండేవారు. జీతం కాకుండా ప్రతి కేసులో తనకు వచ్చే ఫీజులో నుంచి కొంత మెుత్తాన్ని గుమాస్తాలకు ఇచ్చేవారు. సిబ్బంది పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా చేసేవారు. అంతేకాకుండా వాళ్ళను కుటుంబ సభ్యులుగా భావించి వారి పెళ్లిళ్లకు దిల్లీలోని ఇంటిని వేదికగా మార్చేవారు. ఆ కృతజ్ఞతతో వారు జైట్లీ అమృత్‌సర్‌ బరిలోకి దిగినప్పుడు ఆయన గెలుపు కోపం వారు అహర్నిశలు శ్రమించారు.

Next Story

RELATED STORIES