19 నెలల జైలు శిక్ష అనుభవించిన జైట్లీ..

19 నెలల జైలు శిక్ష అనుభవించిన జైట్లీ..

విద్యార్థిగా ఉన్నప్పుడే అరుణ్ జైట్లీ కళాశాలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. జయప్రకాష్ నారాయణ్ విధానాలు నచ్చి ఆయన్ని రాజకీయ గురువుగా భావించేవారు. జైట్లీ పాలిటిక్స్‌లో అడుగుపెట్టేనాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలు శిక్షను జైట్లీ అనుభవించారు. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి.. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు జైట్లీ లోక్ తంత్ర యువ మోర్చకి కన్వీనర్‌గా వ్యవహరించేవారు. 1977లో జైట్లీ ఏబీవీపీ ఢిల్లీ ప్రెసిడెంట్‌గా

నియమితులయ్యారు. 1980లో బీజేపీలోకి అడుగుపెట్టారు. అదే సంవత్సరం ఆయన ఢిల్లీ యూనిట్ యూత్ వింగ్‌కి సెక్రటరీగా నియమితులయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story