జబర్దస్త్‌‌ షోలో హైపర్ ఆది మిస్.. కారణం..

జబర్దస్త్‌‌ షోలో హైపర్ ఆది మిస్.. కారణం..
X

ఉప్పు లేకపోతే కూర ఎలా రుచిగా ఉండదో.. హైపర్ ఆదీ లేకపోతే జబర్దస్త్ షో కూడా అలానే ఉంటుంది. కామెడీ పంచులతో మంచి టైమింగ్‌తో బుల్లి తెర ప్రేక్షకులను నవ్వించే ఆది ఓ షోలో కనిపించలేదు. దాంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. వెండితెర మీద బ్రహ్మానందాన్ని చూడగానే ఎలా నవ్వొస్తుందో.. బుల్లి తెర మీద ఆదిని చూడగానే ఈసారి ఏం పంచులేస్తాడో అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. కడుపుబ్బా నవ్వించే అతడి పంచులంటే జడ్జ్‌లకు కూడా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్. షోలోని పార్టిసిపెంట్లంతా ఎవరికీ ఎవరూ తక్కువ కాదు. ఎవరి కామెడీ వారిదే. అయినా ఆదీకి ఉన్న ఇమేజ్ వేరు. రైటర్‌ కూడా అయిన ఆదీకి సినిమా అవకాశాలూ తలుపు తట్టాయి. ఇంతకీ ఈ వారం షోలో హైపర్ ఆదీ స్కిట్ ఎందుకు లేదని కారణం విచారిస్తే.. ఆయన టీమ్ ‌అంతా విదేశీయానం చేస్తున్నారు. అమెరికా సహా పలు దేశాల్లో తెలుగు వాళ్లున్న చోట ప్రత్యేకంగా కొన్ని స్కిట్స్ చేయడానికి వెళ్లినట్లు సమాచారం. అందుకే జబర్థస్త్ షోకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.

Next Story

RELATED STORIES