క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పించుకున్న భార్య, పిల్లలు

క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పించుకున్న భార్య, పిల్లలు
X

టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. కొచ్చిలోని ఎడపల్లి ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు శ్రీశాంత్ వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తాను ముంబైలో ఉన్నట్టు శ్రీశాంత్ తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో తన భార్యా, పిల్లలు, పనిమనిషి ఉన్నారన్నారు. కాగా తెల్లవారుజామున ఇంట్లోనుంచి మంటలు రావడంతో స్థానికులు గమనించి కిటికీ అద్దాలు బద్దలుకొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని డ్రాయింగ్ రూములో మంటలు చెలరేగాయని, సీలింగ్ ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్టు అధికారులు భావిస్తున్నారు.

Next Story

RELATED STORIES