అజిత్ దోవల్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

అజిత్ దోవల్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం
X

ఆయన ఇండియన్ జేబ్స్ బాండ్. గూఢచారి సినిమాల్లో హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషించిన స్పై. ఉగ్రవాదుల ఆనుపానులు పసిగట్టేందుకు ప్రాణాల ఫణంగా పెట్టి ఇన్ఫర్మేషన్ సేకరించిన గూఢచారి అజిత్ దోవల్..ఆ తర్వాతి కాలంలో కేంద్రంలో కీలక భాధ్యతలు పోషించారు. ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న దోవల్.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ములో ఉగ్రవాద ప్రభాల్యం ఉన్న ప్రాంతాల్లోనే పర్యటించి సత్తా చాటారాయన.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు మోదీ సర్కారు గురుతర బాధ్యతనే అప్పగించారు. త్రివిధ దళాలకు ఒకే బాస్ ఉండాలా ఎర్రకోట బురుజుల వేదికగా ప్రధాని ప్రకటించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్న కేంద్రం.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవికి అర్హులైనవారిని ఎంపిక చేసే బాధ్యతను దోవల్‌కు అప్పచెప్పింది. అంతేకాదు.. CDS పదవికి నిబంధనలను రూపొందించడానికి దోవల్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పా టు చేసింది. భద్రతా వ్యవహారాల కమిటీ సూచించిన సూచనలను అమలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అజిత్ దోవల్‌కి లేఖ కూడా రాసింది.

ప్రస్తుతం అజిత్ దోవల్, ఫ్రాన్స్‌లో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత CDS ఎంపికపై కసరత్తు చేయనున్నారు. నిబంధనలు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి త్రివిధ దళాలకు చీఫ్ లు ఉన్నా కీలక సమయాల్లో వారి మధ్య సమన్వయం కుదరటం లేదన్నది వారి వాదన. అందుకే, మూడు విభాగాలను మేనేజ్ చేయడానికి ప్రత్యేకంగా ఓ చీఫ్ ఉండాలన్నది మోదీ అభిప్రాయం. మోదీ సూచనపై సైనికవర్గాల నుంచి కూడా సాను కూల స్పందన వచ్చింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని చేపట్టడానికి పలువురు సైనిక ఉన్నతాధికారులు పోటీ పడుతున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్‌చీఫ్ మార్షల్ B.S ధనోవా మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఐతే, B.S ధనోవా సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నాను. ఈ నేపథ్యంలో CDS చీఫ్ పోస్టు బిపిన్ రావత్‌ను వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Next Story

RELATED STORIES